Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సినిమా.. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్!

Bumper offer for Rakul Preet Singh movie
  • నిన్న విడుదలైన రకుల్ సినిమా 'మేరే హజ్బెండ్ కీ బీవీ'
  • విక్కీ కౌశల్ 'ఛావా' సూపర్ హిట్ కావడంతో రకుల్ సినిమాకు కష్టాలు
  • ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ అంటూ ఆఫర్
ఒకటి కొంటే మరొకటి ఉచితం వంటి ఆఫర్లు ఎవరికైనా ఇష్టంగానే ఉంటాయి. బిజినెస్ పెంచుకోవడానికి ఇలాంటి ఆఫర్లను ఇస్తుంటారు. ఇప్పుడు ఈ ఆఫర్ బాలీవుడ్ కి కూడా పాకింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా ఇస్తామని ఒక బాలీవుడ్ సినిమా ప్రకటించింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన హిందీ మూవీ 'మేరే హజ్బెండ్ కీ బీవీ' నిన్న విడుదలయింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరో కాగా... భూమీ పెడ్నేకర్ మరో కథానాయికగా నటించింది. 

మరోవైపు విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. దీంతో తమ సినిమా 'మేరే హజ్బెండ్ కీ బీవీ'కి ప్రేక్షకులను రప్పించేందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ను చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయినా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. 
Rakul Preet Singh
Bollywood

More Telugu News