Revanth Reddy: పోలేపల్లిలో ఎల్లమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy visits Renuka Ellamma temple in Polepalli
  • వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • రేణుకా ఎల్లమ్మ ఆలయ సందర్శన
  • రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ వర్గాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 

కాగా, ముఖ్యమంత్రికి ఆలయ వర్గాలు ఎల్లమ్మ తల్లి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, జూపల్లి, దామోదర రాజనర్సింహ తదితరులు కూడా పాల్గొన్నారు.
Revanth Reddy
Renuka Ellamma Temple
Polepalli
Vikarabad District

More Telugu News