Elon Musk: భార్యతో కలిసి జెలెన్ స్కీ ఫొటో షూట్... ఫైర్ అయిన ఎలాన్ మస్క్

Elong Musk fires on Zelensky for photoshoot with his wife
  • యుద్ధంలో పిల్లలు చనిపోతుంటే ఫొటో షూట్ అవసరమా? అన్న మస్క్
  • యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవేం పనులని మండిపాటు
  • జెలెన్ స్కీ ఒక నియంత అని ఇటీవల విమర్శించిన ట్రంప్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా అధినేత, వైట్ హౌస్ సలహాదారు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భార్య ఒలెనాతో కలిసి జెలెన్ స్కీ ఫొటో షూట్ లో పాల్గొనడమే మస్క్ ఆగ్రహానికి కారణం. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ఈ ఫొటోలను తీశారు. ఈ నేపథ్యంలో మస్క్ స్పందిస్తూ... యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే భార్యతో కలిసి ఫొటో షూట్ చేస్తావా? అని మండిపడ్డారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవేం పనులని మస్క్ ప్రశ్నించారు. 

జెలెన్ స్కీపై గతంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా మండిపడ్డారు. ఉక్రెయిన్ కు మానవతా దృక్పథంతో తాము సాయం చేస్తుంటే... జెలెన్ స్కీ మాత్రం తమను పిచ్చోళ్లను చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడు శాంతి చర్చల కోసం ప్రపంచ నేతలు మాట్లాడుతున్న తరుణంలో జెలెన్ స్కీ తీరు వివాదాస్పదంగా మారింది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ... జెలెన్ స్కీ ఒక నియంత అని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో ఎన్నికలు కూడా నిర్వహించలేదని విమర్శించారు. మరోవైపు, ఉక్రెయిన్ ప్రమేయం లేకుండానే శాంతి చర్చలు జరుగుతున్నాయి. దీనిపై జెలెన్ స్కీ అసహనం కూడా వ్యక్తం చేశారు.
Elon Musk
Volodymyr Zelensky
Photoshoot

More Telugu News