Auto Rickshaw: వైర‌ల్ వీడియో.. ఒక్క‌ ఆటోలో 19 మంది ప్ర‌యాణికులు.. నిర్ఘాంత‌పోయిన‌ పోలీసులు!

19 Passengers Found Travelling in Single Auto Rickshaw UP Police Seize Vehicle After Video Goes Viral
  • ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఘటన 
  • సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు
  • అందులో ప్ర‌యాణిస్తున్న వారిని లెక్కించి పోలీసులు షాక్‌
ఓ ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి పోలీసులు విస్మయం చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఈ సంఘటన జరిగింది. సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ఫిబ్రవరి 15న రాత్రివేళ‌ బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళుతున్న ఒక ఆటోను పోలీసులు చూశారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుమానం వచ్చి చెక్‌పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు.

అందులో ప్రయాణిస్తున్న‌ వారిని ఒక్కొక్క‌రిగా కింద‌కు దిగ‌మ‌ని చెప్పి, పోలీసులు లెక్కించారు. దాంతో 19 మంది వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్న‌ట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంత‌పోయారు. వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్న‌ ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో ఫ‌న్నీగా స్పందిస్తున్నారు.  
Auto Rickshaw
Passengers
UP Police
Uttar Pradesh
Viral Videos

More Telugu News