Asias Richest Families: ఆసియాలో సంప‌న్న కుటుంబాల జాబితా.. అగ్ర‌స్థానం స‌హా టాప్‌-10లో 4 భార‌తీయ ఫ్యామిలీలు!

Asias Richest Families Indians Dominate With 4 in Top 10 by Bloomberg
  • ఆసియాలో అత్యంత సంప‌న్న కుటుంబాల జాబితాను రిలీజ్ చేసిన‌ బ్లూమ్‌బ‌ర్గ్ 
  • అత్యంత ధ‌నిక ఫ్యామిలీగా రూ. 7.86ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో ముకేశ్ అంబానీ కుటుంబం 
  • నాలుగో స్థానంలో మిస్త్రీ కుటుంబం (రూ. 3.25 ల‌క్ష‌ల కోట్లు)
  • ఏడు, తొమ్మిదో స్థానాల్లో వ‌రుస‌గా జిందాల్, బిర్లా ఫ్యామిలీలు
ఆసియాలోనే అత్యంత సంప‌న్న కుటుంబాల జాబితాను తాజాగా బ్లూమ్‌బ‌ర్గ్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో మ‌న భార‌తీయ కుటుంబం అగ్ర‌స్థానంలో నిలిచింది. అలాగే జాబితాలో టాప్‌-10లో నాలుగు భార‌తీయ ఫ్యామిలీలు చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. 

కాగా, ఆసియాలో అత్యంత ధ‌నిక ఫ్యామిలీగా రూ. 7.86ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో ముకేశ్ అంబానీ కుటుంబం అగ్ర‌స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే రెండో స్థానంలో థాయ్‌లాండ్‌కు చెందిన చీరావ‌నోండ్ కుటుంబం (రూ. 3.70ల‌క్ష‌ల కోట్లు) నిలిచింది. 

ఇక మూడో స్థానంలో ఇండోనేషియాకు చెందిన హ‌ర్టోనో ఫ్యామిలీ (రూ. 3.66 ల‌క్ష‌ల కోట్లు) ఉంటే... నాలుగో స్థానాన్ని రూ. 3.25 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో మిస్త్రీ కుటుంబం ద‌క్కించుకుంది. అలాగే ఏడు, తొమ్మిదో స్థానాల్లో వ‌రుస‌గా జిందాల్ (రూ. 2.44ల‌క్ష‌ల కోట్లు), బిర్లా (రూ. 1.99ల‌క్ష‌ల కోట్లు) ఫ్యామిలీలు నిలిచాయి. 
Asias Richest Families
Indians
Mukesh Ambani Family
Bloomberg

More Telugu News