Chandrababu: అనపర్తి ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు

CM Chandrababu attends Anaparti MLA  son Manoj Reddy wedding in Hyderabad
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఓ వివాహానికి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి వివాహం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు విచ్చేశారు. వధూవరులు సుమేఘా రెడ్డి, మనోజ్ రెడ్డిలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు రాకతో పెళ్లి వేడుకలో భారీ కోలాహలం నెలకొంది.
Chandrababu
Nalamilli Ramakrishna Reddy
Wedding
Hyderabad
TDP

More Telugu News