Delhi BJP CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?... క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఇన్ఛార్జ్

BJP Delhi chief Baijayant Panda key announcement on Delhi new CM
  • ఢిల్లీలో ఘన విజయం దిశగా బీజేపీ
  • సీఎం ఎవరనే దానిపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ బైజయంత్
  • గెలిచిన వారిలో ఎవరైనా సీఎం కావచ్చని వ్యాఖ్య
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఘన విజయం దిశగా దూసుకోపోతోంది. ఈ తరుణంతో ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడుతూ... సీఎం ఎవరనే దానిపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ఎవరైనా సీఎం కావచ్చని తెలిపారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను తాము తీసుకుంటామని... తమ నివేదిక పార్టీ పార్లమెంటరీ బోర్డుకు వెళుతుందని... అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీలో సామాన్యులకు కూడా అవకాశాలు ఉంటాయని... ఇతర పార్టీల్లో అలాంటి అవకాశాలు ఉండవని అన్నారు. 

మరోవైపు, న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఓడించారు. కేజ్రీవాల్ ను ఓడించిన వర్మ బీజేపీలో స్టార్ గా అవతరించారు. సీఎం రేసులో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గెలిచిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పర్వేశ్ వర్మ కలిశారు. 
Delhi BJP CM
Baijayant Panda
BJP

More Telugu News