ప్రయాణికులకు గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్ల రద్దు
- ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ లాకింగ్ పనులు
- పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- ఆలస్యంగా బయలుదేరనున్న మరికొన్ని రైళ్లు
సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17201/170202)ను 11వ తేదీ నుంచి 21 వరకు, సికింద్రాబాద్-సిర్పూరు కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233/17234) రైలును 10 నుంచి 21 వరకు రద్దు చేశారు.
అలాగే, గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12705/12706)ను 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో.. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (1713/12714)ను 11, 14, 16, 18, 19, 20, తేదీల్లో రద్దు చేశారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20834) 19, 20 తేదీల్లో 75 నిమిషాలు, ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17406) 9, 11, 14, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయని రైల్వే అధికారులు తెలిపారు.