council of higher education: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ ఇదిగో!

council of higher education releases pecet and edcet 2025 schedule
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
  • మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్
  • జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు
తెలంగాణలో ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌‌ను ఉన్నత విద్యా మండలి గురువారం విడుదల చేసింది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న జారీ కానుంది. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. 

తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. 
council of higher education
Telangana
edcet 2025 schedule

More Telugu News