దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక సమావేశం
- బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు
- నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
ఫిరాయింపుల వ్యవహారంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై వీరు ప్రధానంగా చర్చిస్తున్నారు. అందరూ ఢిల్లీకి వెళ్లి అక్కడ సమాలోచనలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలయింది. దీంతో, 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్లింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే వీరందరికీ నోటీసులు జారీ అయ్యాయి.