కంగ్రాట్స్ పల్లవి... ఏపీ వెయిట్ లిఫ్టర్ కు చంద్రబాబు అభినందనలు
- ఉత్తరాఖండ్ లో 38వ జాతీయ క్రీడలు
- సత్తా చాటుతున్న ఏపీ వెయిట్ లిఫ్టర్లు
- నిన్న పురుషుల 67 కిలోల కేటగిరీలో నీలం రాజుకు స్వర్ణం
- నేడు మహిళల 71 కిలోల విభాగంలో పల్లవికి గోల్డ్ మెడల్
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ పల్లవి... అని అభినందనలు తెలిపారు. విజయనగరం నుంచి వచ్చిన మన రాష్ట్ర పుత్రిక... 71 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచింది అని వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.