Union Budget 2025: కేంద్ర బ‌డ్జెట్‌-2025.. ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల‌కు గుడ్‌న్యూస్

Good News for SC and ST Women through Union Budget 2025
  • ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల కోసం ట‌ర్మ్ లోన్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన కేంద్రం
  • ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు
  • మొత్తం 5 ల‌క్ష‌ల మంది షెడ్యూల్ కులాల మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజ‌నం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌-2025ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో షెడ్యూల్ కులాలు, తెగ‌ల‌కు చెందిన‌ మ‌హిళ‌ల‌కు కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల కోసం ట‌ర్మ్ లోన్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు అందించ‌నున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 

ఈ ప‌థ‌కం ద్వారా మొత్తం 5 ల‌క్ష‌ల మంది ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. తొలిసారి సొంత వ్యాపారాల‌ను ప్రారంభించే, ఉన్న వ్యాపారాల‌ను విస్త‌రించాల‌నుకునే మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ఈ ప‌థ‌కం ద్వారా దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు, ఎస్‌సీ, ఎస్‌టీ వ‌ర్గాల‌కు చెందిన వారికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు.  
Union Budget 2025
SC and ST Women
Term Loan Scheme
Nirmala Sitharaman

More Telugu News