Chandrababu: ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం... ముహూర్తం ఖరారు

Chandrababu set to campaign in Delhi elections
  • ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
  • ఫిబ్రవరి 2న ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
  • ప్రచారానికి చంద్రబాబును ఆహ్వానించిన తెలుగు అసోసియేషన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 2న ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఏపీ సీఎం చంద్రబాబును ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించింది. 

ఇవాళ టీడీపీ ఎంపీలతో సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో తెలుగు వారు ఉన్న చోట్ల ప్రచారం చేయాలని ఎంపీలకు సూచించారు. 

ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ఢిల్లీ ఎన్నికల బరిలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Chandrababu
Delhi elections
Campaign

More Telugu News