Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు విశాల దృక్పథం కలిగిన వ్యక్తి: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు

Telangana minister Sridhar Babu says AP CM Chandrababu is the man of broad thinking
  • దావోస్ లో చంద్రబాబుతో మాట్లాడానన్న శ్రీధర్ బాబు
  • పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని వెల్లడి
  • వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాల దృక్పథం కలిగిన వ్యక్తి అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభివర్ణించారు. ఇటీవల దావోస్ పర్యటనలో చంద్రబాబును కలిశానని, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఆలోచనా విధానం ఎంత విశాలమైనదో అర్థం చేసుకున్నానని వివరించారు. పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని కితాబిచ్చారు. 

ఏపీకి తీర ప్రాంతం, అపారమైన వనరులు ఉన్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పరిశ్రమలు వస్తాయని అన్నారు. వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. 

దావోస్ లో ఏపీ పలు కంపెనీలతో ఎంవోయూలు కూడా చేసుకుందని వెల్లడించారు. అయితే, ఎంవోయూలను ఏపీలోనే ప్రకటిస్తామని దావోస్ లో నారా లోకేశ్ చెప్పారని శ్రీధర్ బాబు వివరించారు.
Chandrababu
Sridhar Babu
Andhra Pradesh
Telangana
Davos

More Telugu News