mohammed siraj: సోషల్ మీడియాలో వార్తలపై స్పందించిన సిరాజ్

after rumours mohammed siraj shares photo with asha bhosle granddaughter
  • జనై భోస్లే తనకు సోదరి లాంటిదని పేర్కొన్న సిరాజ్ 
  • జనై భోస్లే, సిరాజ్ లు డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్
  • సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన సిరాజ్, జనై భోస్లే 
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, బాలీవుడ్ సింగర్ జనై భోస్లేల మధ్య సంబంధంపై ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ముంబైలోని బాంద్రాలో జరిగిన జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం, ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఆ ఫోటోలలో సిరాజ్, జనై చాలా సన్నిహితంగా కనిపించడంతో వీరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావించిన సిరాజ్ వెంటనే స్పందించారు. తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జనై తనకు సోదరి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "ఆమె లాంటి సోదరి నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నేను ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లుగా, ఆమె వెయ్యి మందిలో ఒకరు" అంటూ కవితాత్మకంగా రాసుకొచ్చారు. మరోవైపు జనై కూడా ఈ పుకార్లపై స్పందిస్తూ, సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొన్నారు.

సింగర్ జనై భోస్లే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. 
mohammed siraj
jani bhosle
asha bhosle granddaughter
Sports News

More Telugu News