Komatireddy Venkat Reddy: అలాంటి చిత్రాల‌కు త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వ ప్రోత్సాహం ఉంటుంది: మంత్రి కోమ‌టిరెడ్డి

Minister Komatireddy Venkat Reddy Released The Teaser of Love Your Father
  • అర్థ‌వంత‌మైన క‌థ‌ల‌తో వ‌చ్చే చిత్రాలకు ప్ర‌భుత్వ ప్రోత్సాహం ఉంటుంద‌న్న మంత్రి
  • క‌థాబ‌లం ఉన్న మూవీల‌పై ఇండ‌స్ట్రీ దృష్టిసారిస్తే బాగుంటుంద‌ని సూచ‌న‌
  • 'ల‌వ్ యువ‌ర్ ఫాద‌ర్' చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన‌ మంత్రి కోమ‌టిరెడ్డి
  • 'సంక్రాంతికి వ‌స్తున్నాం' సినిమాపై ప్ర‌శంస‌లు
ఆద‌ర్శ‌వంత‌మైన‌, అర్థ‌వంత‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే చిత్రాలకు త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వ ప్రోత్సాహం ఉంటుంద‌ని తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి  కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీశామ‌ని, టికెట్ల ధ‌ర‌లు పెంచాలంటూ, అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కాకుండా క‌థాబ‌లం ఉన్న మూవీల‌పై ఇండ‌స్ట్రీ దృష్టిసారిస్తే బాగుంటుంద‌ని తెలిపారు. 

శ్రీహ‌ర్ష‌, క‌షిక క‌పూర్ జంట‌గా ఎస్‌పీ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన 'ల‌వ్ యువ‌ర్ ఫాద‌ర్' చిత్ర టీజ‌ర్‌ను మంత్రి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శక నిర్మాత‌ల‌ను అభినందించారు. అలాగే సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన 'సంక్రాంతికి వ‌స్తున్నాం' సినిమాపై మంత్రి ప్ర‌శంస‌లు కురిపించారు. చిన్న సినిమాగా విడుద‌లై భారీ చిత్రాల‌తో స‌మానంగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింద‌ని కొనియాడారు. 
Komatireddy Venkat Reddy
Love Your Father
Tollywood
Telangana

More Telugu News