BJP: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్... పార్టీకి మేయర్ రాజీనామా

Karimnagar Mayor leaver BRS and may join BJP
  • బీఆర్ఎస్ పార్టీకి మేయర్, పదిమంది కార్పొరేటర్లు గుడ్‌బై
  • రేపు బీజేపీలో చేరే అవకాశం
  • బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం
కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మేయర్‌తో పాటు పదిమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ను వీడారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన వీరు... త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరు రేపు బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు.
BJP
Karimnagar District
Telangana
BRS

More Telugu News