కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు.. ఏపీ జవాన్ మృతి
- సోమవారం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు
- ఏపీ జవాను కార్తీక్ కు బుల్లెట్ గాయాలు
- చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస
గాయపడ్డ కార్తీక్ ను తోటి సైనికులు హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, చిత్తూరు జిల్లాలోని బంగారు పాల్యం మండలం రాగి మానుపెంట గ్రామానికి చెందిన పంగల కార్తీక్ 2017లో ఆర్మీలో చేరారు. కార్తీక్ మరణవార్తతో రాగి మానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కార్తీక్ ఇటీవల దీపావళి పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు ఊరిలో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లారని గ్రామస్థులు తెలిపారు.