ప్రారంభోత్సవం తర్వాత మూతబడిన ఆ తలుపులు మళ్లీ తెరుచుకోలేదు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత విమర్శ
- వరంగల్ నగర ప్రతిష్ఠను పెంచేందుకు కేసీఆర్ నిర్మించారన్న కవిత
- కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం తన ఘనతగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శ
- కాళోజీ కళాక్షేత్రాన్ని వినియోగంలోకి తీసుకు రావాలన్న కవిత
వరంగల్ నగర ప్రతిష్ఠను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కాళోజీ క్షేత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిందన్నారు. కాళోజీ కళాక్షేత్రం తన ఘనతగా చిత్రీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిపై చూపించిన శ్రద్ధ... దానిని వినియోగంలోకి తీసుకు రావడంపై పెడితే బాగుంటుందన్నారు.