kho kho world cup: మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్... పురుషుల టైటిల్ కూడా మనదే!

india men make double at kho kho world cup beat nepal in final after women victory
  • ఢిల్లీ వేదికగా ఫైనల్‌లో నేపాల్‌ జట్టుతో తలపడిన భారత్
  • ఫైనల్ మ్యాచ్‌లో 54–36 తేడాతో నేపాల్‌పై విజయం సాధించిన భారత్ పురుషుల జట్టు
  • అటు మహిళలు, ఇటు పురుషుల జట్టులోనూ భారత్ ప్రత్యర్ధి జట్లు నేపాల్‌యే  
ఖోఖో మొదటి ప్రపంచ కప్ టోర్నీలో భారత్ అదరగొట్టింది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి కప్ సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల జట్టు విజయం సాధించింది. 54-36 తేడాతో నేపాల్ జట్టును భారత్ చిత్తు చేసింది. 

తొలి రౌండ్‌లో 26–18 అధిక్యతతో నిలబడిన భారత్ అదే జోరును చివరి వరకూ కొనసాగించింది. అటు మహిళలు, ఇటు పురుషుల జట్టులోనూ ప్రత్యర్ధి జట్లు నేపాల్ కావడం గమనార్హం. తొలి సారిగా నిర్వహించిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ మహిళల జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ టోర్నీలో భారత్ 78-40 తో నేపాల్‌ను చిత్తు చేసింది. 
kho kho world cup
India
Nepal
Sports News

More Telugu News