మార్స్ పై రాత్రి ఎలా ఉంటుంది?... నాసా రోవర్ తీసిన వీడియో ఇదిగో!
- పౌర్ణమి వంటి సమయంలో వెన్నెల వెలుగులు ఉంటే... అమావాస్యకు చిమ్మ చీకటి అలుముకుంటుంది
- మరి అంగారక గ్రహంపై రాత్రి ఎలా ఉంటుందనే వీడియోను నాసా విడుదల చేసింది
వాతావరణం లేకపోవడంతో...
భూమిపై మనం వాడే విద్యుద్దీపాల వెలుగు కారణంగా ఆకాశం సరిగా కనిపించదు. అందుకే నగరాలకు దూరంగా కొండలు, గుట్టల ప్రాంతాలకు వెళ్లి ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అంగారకుడిపై ఈ సమస్య లేదు. పైగా భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. అందువల్ల అంతరిక్షం నుంచి వచ్చే వెలుగు నేరుగా ప్రసరిస్తూ ఉంటుంది. దీనితో అంగారకుడిపై రాత్రిపూట కూడా కొంత మేర వెలుతురు కనిపిస్తుంది. నక్షత్రాలు అయితే మరింత స్పష్టంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.