Pawan Kalyan: ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎంలకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked CM Chandrababu for allocating land to NDRF and NIDM
  • ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న పవన్
  • ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని వెల్లడి
  • మూగ జీవాల ప్రాణాలు కూడా కాపాడారని ప్రశంసలు
కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని, ముఖ్యంగా, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మర్చిపోలేమని అన్నారు.  

ఎన్డీఆర్ఎఫ్ 18 వేలకు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిందని, మూగ జీవుల ప్రాణాలను కూడా రక్షించిందని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాజెక్టులకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. 

విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు.
Pawan Kalyan
Chandrababu
NDRF
NIDM
Andhra Pradesh

More Telugu News