గోమూత్రం ఔషధం.. తాగితే జ్వరం తగ్గుతుంది: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
--
ఈ సందర్భంగా కామకోటి మాట్లాడుతూ.. ఓసారి తన తండ్రికి జ్వరం వస్తే ఓ సన్యాసిని ఆశ్రయించారని, వైద్యుడి వద్దకు వెళ్లే విషయంపై ఆయన సలహా అడిగారని చెప్పారు. జ్వరానికి వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని చెబుతూ గోమూత్రం తాగాలని ఆ సన్యాసి సూచించారని వివరించారు. తన తండ్రి గోమూత్రం సేవించిన పదిహేను నిమిషాల్లోనే జ్వరం తగ్గిందని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాను అవి అంతం చేస్తాయని ప్రొఫెసర్ కామకోటి వివరించారు.