Amit Shah: గన్నవరం ఎయిర్ పోర్టులో అమిత్ షాకు స్వాగతం పలికిన నారా లోకేశ్

Nara Lokesh welcomes Amit Shah in Gannavaram airport
  • ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా
  • చంద్రబాబు నివాసంలో డిన్నర్
  • ఈ రాత్రికి విజయవాడో నోవాటెల్ లో బస
  • రేపు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ నూతన క్యాంపస్ కు ప్రారంభోత్సవం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకు విచ్చేశారు. రాత్రి 8.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు ఏపీ మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. అమిత్ షా... సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేయనున్నారు. చంద్రబాబు నివాసంలో ఈ విందుకు ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, కొందరు సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు. 

అమిత్ షా విందు అనంతరం, ఈ రాత్రికి విజయవాడ నోవాటెల్ హోటల్ లో బస చేయనున్నారు. రేపు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ నూతన క్యాంపస్ ను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. 
Amit Shah
Nara Lokesh
Vijayawada
Andhra Pradesh

More Telugu News