Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సింగపూర్ సంస్థ

STT Global Data Centres signs an MoU with the Telangana govt
  • రాష్ట్రంలో రూ.3,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సింగపూర్ సంస్థ
  • మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కుదిరిన ఒప్పందం
  • హైదరాబాద్ డేటా సెంటర్ హబ్‌గా మారుతోందన్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రూ.3,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది.

సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఎస్‌‍టీటీ ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు ముచ్చర్లలోని మీర్‌ఖాన్‌పేట్‌లో మరో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ డేటా సెంటర్ హబ్‌గా మారుతోందన్నారు. ఎస్‌టీటీ డేటా సెంటర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
Telangana
Data Centre
Investment

More Telugu News