Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు నిందితుడి అరెస్ట్

Police arrests Saif Ali Khan attacker in Chhattisgarh

  • గురువారం రాత్రి సైఫ్ అలీ ఖాన్ పై దాడి
  • తన నివాసంలోనే కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు
  • నిందితుడి కోసం తీవ్ర గాలింపు
  • ఛత్తీస్ గఢ్ లో అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు
  • ఛత్తీస్ గఢ్ బయల్దేరిన ముంబయి పోలీసులు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. గురువారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ తన నివాసంలోనే కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం దుండగుడు పరారయ్యాడు. 

సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడి కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. దాదాపు 20 బృందాలుగా ఏర్పడిన పోలీసులు వివిధ ప్రాంతాలను జల్లెడపట్టారు. చివరికి నిందితుడిని ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో అరెస్ట్ చేశారు. 

ముంబయి పోలీసులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ రైల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు ఆకాశ్ అని గుర్తించారు. నిందితుడి కోసం ముంబయి పోలీసులు ఛత్తీస్ గఢ్ బయల్దేరారు.

Saif Ali Khan
Knife Attack
Arrest
Police
Chhattisgarh
Mumbai
Bollywood
  • Loading...

More Telugu News