Nara Lokesh: నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలి... చంద్రబాబుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడి విజ్ఞప్తి
- నేడు ఎన్టీఆర్ వర్ధంతి
- మైదుకూరులో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు
- పార్టీకి, యువతకు భరోసా ఇవ్వాలంటే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న శ్రీనివాసరెడ్డి
ఇవాళ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాగా.... ఆయన ముందుకు అనూహ్య ప్రతిపాదన వచ్చింది. నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సీఎం చంద్రబాబుకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.
"మాకొక కోరిక సార్! టీడీపీ ఆవిర్భవించిన 43 ఏళ్ల తర్వాత మూడో తరం నేతగా నారా లోకేశ్ గారు మన పార్టీలోకి వచ్చారు. భవిష్యత్తులో పార్టీకి భరోసా ఇవ్వాలన్నా, యువతకు భరోసా ఇవ్వాలన్నా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం సార్" అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు.