యోనో యాప్ పై కీలక ప్రకటన చేసిన ఎస్బీఐ
- యోనో యాప్ వాడే ఎస్బీఐ కస్టమర్లు ఆండ్రాయిడ్ 12, అంత కంటే ఎక్కువ వెర్షన్ మొబైల్స్ వాడాలి
- పాత వర్షన్ మొబైల్లో మార్చి 1 నుంచి యోనో సేవలు బంద్ అవుతాయన్న ఎస్బీఐ
- ఎస్బీఐ ఖాతాదారులు కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన
ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో త్వరలోనే యోనో సేవలు నిలిపి వేయనున్నట్లు తెలిపింది. వెంటనే ఎస్బీఐ ఖాతాదారులు కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచించింది. ఈ విషయాన్ని ఖాతాదారులకు సందేశాల ద్వారా తెలియజేస్తోంది. ఆండ్రాయిడ్ 12 అంతకంటే ఎక్కువ వెర్షన్ మొబైల్‌కి అప్‌గ్రేడ్ కావడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది.
అప్పటి వరకూ మాత్రమే యోనో సేవలు ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ వెర్షన్ మొబైల్ వాడే వారు కూడా పొందే అవకాశం ఉంటుంది. పాత వెర్షన్ మొబైల్స్‌లో మార్చి 1 నుంచి యోనో సేవలు నిలిచిపోతాయని ఖాతాదారులకు ఎస్బీఐ స్పష్టం చేసింది.