రికార్డు సృష్టించిన స్మృతి మంధాన... తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఘనత!
- రాజ్‌కోట్ వేదికగా భారత్, ఐర్లాండ్ మూడో వన్డే
- ఆకాశమే హద్దుగా చెలరేగిన స్మృతి మంధాన
- వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు
ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ సింగ్ (87 బంతులు) పేరిట ఉండేది. కాగా, వన్డేల్లో స్మృతికి ఇది పదో సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచులో ఆమె 80 బంతుల్లో 7 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తొలి వికెట్‌కు ప్రతీక రావల్‌తో కలిసి స్మృతి రికార్డు స్థాయిలో 233 పరుగుల భాగస్వామ్యం అందించారు.