ఏనుగును రెచ్చగొట్టి... పరుగెత్తించి...!
- గుంపుగా వెళుతున్న ఏనుగుల్లో ఒకదానిని రెచ్చగొట్టిన యువకుడు
- అతడి వెంటపడి పరుగెత్తి వదిలేసిన ఏనుగు
- అయినా ఆ ఏనుగును రెచ్చగొట్టడం ఆపని యువకుడు
మనుషుల వెంటపడుతుంది...
‘‘అది గున్న ఏనుగు. వేగంగా పరుగెత్తలేదు. అతడు యువకుడు కాబట్టి వేగంగా పరుగెడుతూ ఆ ఏనుగును రెచ్చగొట్టాడు. కానీ ఈ తీరుతో చిరాకు చెందిన ఏనుగు ఊరికే ఉండదు. కొన్ని రోజుల పాటు అయినా సరే... మనుషులు కనిపిస్తే ఆగ్రహంతో వ్యవహరిస్తుంది. వెంటపడి ప్రమాదానికి కారణమైనా అవుతుంది. మీ సరదా కోసం అడవి జంతువులను ఇలా చిరాకు పెట్టవద్దు..’’ అని పర్వీన్ కాశ్వాన్ తన పోస్టులో స్పష్టం చేశారు.
వైరల్ గా మారిన వీడియో...
- ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి పర్వీన్ కాశ్వాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
- ఈ వీడియోలో ఏనుగును రెచ్చగొట్టిన యువకుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఆ ఏనుగు మరెవరిపై అయినా దాడి చేస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.
- ఈ వీడియోలోని యువకుడిని గుర్తించి శిక్షించాలని, మరొకరు ఇలా వ్యవహరించకుండా చేయాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.