HYDRA: పటిష్ఠ బందోబస్తు మధ్య మణికొండలో హైడ్రా కూల్చివేతలు

HYDRA demolishes illegal structures in Neknampur pond in  Manikonda
  • నెక్నాంపూర్‌ చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • స్థానికులు కబ్జాకు పాల్పడ్డారని తెలిసి రంగంలోకి దిగిన అధికారులు
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో చర్యలు
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా శుక్రవారం మరోసారి రంగంలోకి దిగింది. నగరంలోని మణికొండలో ఉన్న నెక్నాంపూర్‌ చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. లేక్‌వ్యూ విల్లాస్‌లో అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. స్థానికులు చెరువు కబ్జాకు పాల్పడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణ కావడంతో కూల్చివేతకు హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవాళ (శుక్రవారం) ఉదయం అధికారులు కూల్చివేతకు దిగారు. నిర్మాణదార్ల నుంచి ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.

కాగా, నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ, కబ్జాకోరుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చర్యలను మరింత విస్తృతంగా, పకడ్బందీగా చేపట్టేందుకు పటిష్ఠమైన చర్యలు కూడా తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘గ్రీవెన్స్ డే’ ద్వారా సామాన్య జనాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అంతేకాదు, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా హైడ్రా ఏర్పాటు చేసింది. బుద్ధ భవన్‌లోని బీ-బ్లాక్ కేంద్రంగా ఈ పోలీస్ స్టేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
HYDRA
Manikonda
Telangana
Viral News

More Telugu News