కేటీఆర్ ఏసీబీ విచారణ ప్రారంభం.. దర్యాప్తు అధికారులు వీరే!

కేటీఆర్ ఏసీబీ విచారణ ప్రారంభం.. దర్యాప్తు అధికారులు వీరే!

ACB questioning of KTR started
  • లాయర్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్
  • కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ముగ్గురు అధికారులు
  • ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ తో పాటు ఆయన లాయర్ ను ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించారు. కాసేపటి క్రితం ఏసీబీ విచారణ ప్రారంభమయింది. 

విచారణ గదిలో కేటీఆర్ ఉండగా... కార్యాలయంలోని లైబ్రరీ గదిలో ఆయన లాయర్ ఉన్నారు. విచారణ గదిలో ఉన్న కేటీఆర్ కనిపించేంత దూరంలో ఆయన లాయర్ ఉన్నారు. విచారణ గదిలో ఏం మాట్లాడుతున్నారనేది మాత్రం లాయర్ కు వినిపించదు. వీడియో, ఆడియో రికార్డింగ్ కు కూడా తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఎస్పీ నరేందర్, డీఎస్పీ విచారిస్తున్నారు. విచారణ ప్రక్రియలను ఏసీబీ డైరెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. 
Advertisement
KTR
BRS
Formula E Race Case
ACB

More Telugu News