ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోతున్న హాలీవుడ్ సెలబ్రిటీలు.. మంటల్లో తగలబడుతున్న ఇళ్లు.. వీడియో ఇదిగో!
- అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు
- లాస్ ఏంజిల్స్ లోని ది సాలిసడ్స్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మంటలు
- దాదాపు 3 వేల ఎకరాల దగ్ధం
ఓవైపు ఎగసిపడుతున్న మంటలు, మరోవైపు పొగ కమ్మేయడంతో స్థానికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వాహనాల్లో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండ ప్రాంతం కావడంతో అక్కడి రోడ్లు అన్నీ ఇరుకుగా ఉంటాయని, పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. కార్చిచ్చుకు గాలి తోడవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని వివరించారు. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్‌ఫెర్నాండో ప్రాంతాలకు మంటలు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, కాలిఫోర్నియా కార్చిచ్చు విషయంలో అధికారులను అప్రమత్తం చేశానని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నానని ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. కార్చిచ్చు బాధితులకు వైట్ హౌస్ అవసరమైన సాయం అందిస్తుందని వివరించారు.