Jetwani: హీరోయిన్ జెత్వానీ కేసు... ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టు బెయిల్

AP High Court grants anticipatory bail to IPS officers in heroine Jetwani case
  • ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో ఐపీఎస్ లకు భారీ ఊరట
  • షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా, గున్నీలకు ఊరట
ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు భారీ ఊరటను కల్పించింది. ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలతో పాటు ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, అడ్వొకేట్ వెంకటేశ్వర్లుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ ముగ్గురు ఐపీఎస్ లను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Jetwani
Tollywood
IPS

More Telugu News