Allu Arjun: అల్లు అర్జున్ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన ఓయూ జేఏసీ నేతలు

OU JAC leaders approaches police and alleged threat calls from Allu Arjun fans
  • ఇటీవల సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన
  • అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ నేతల దాడి
  • అల్లు అర్జున్ కు క్షమాపణ చెప్పాలంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయన్న జేఏసీ నేతలు
  • చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వెల్లడి
  • పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హైదరాబాదులో హీరో అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై జేఏసీ నేతలపై కేసు నమోదైంది. తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఓయూ జేఏసీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అల్లు అర్జున్ కు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరించారని తెలిపారు. అల్లు అర్జున్ అభిమానుల పేరుతో ఇలాంటి బెదిరింపు కాల్స్ వందల సంఖ్యలో వచ్చాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తమ ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. తమను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ నేతలు పోలీసులను కోరారు.
Allu Arjun
Fans
OU JAC
Police
Sandhya Theater Incident
Hyderabad

More Telugu News