‘మన్ కీ బాత్’లో అక్కినేని నాగేశ్వరరావును గుర్తుచేసుకున్న మోదీ
- ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమం
- తాజా ఎపిసోడ్ లో సినిమా రంగం గురించి మాట్లాడిన ప్రధాని
- తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీ ప్రముఖుల పేర్ల ప్రస్తావన
వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీరంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు.