మెల్‌బోర్న్ టెస్ట్.. భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పించిన తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్.. తగ్గేదేలే అంటూ సంబరాలు!
- టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన నితీశ్‌కుమార్‌రెడ్డి
- ఆ వెంటనే ‘తగ్గేదేలే’ అంటూ సంబరాలు
- 275 పరుగులకు చేరుకోగానే తప్పిన ఫాలో ఆన్ గండం
నితీశ్‌కు వాషింగ్టన్ సుందర్ అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి నెమ్మదిగా పరుగులు సాధిస్తూ భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించారు. 275 పరుగుల మార్కును చేరుకోగానే భారత జట్టుకు ఫాలో ఆన్ గండం తప్పింది. టీమిండియా ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ 66 పరుగులు, సుందర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.