మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు: ఏపీ సీఎం చంద్రబాబు
- ఢిల్లీలో నేడు కన్నుమూసిన మన్మోహన్ సింగ్
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం
1991లో ఆర్థికమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని, కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్ర్యం నుంచి బయటికి తీసుకువచ్చారని కొనియాడారు.
ఆయన మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు వివరించారు.