Srinivas: పోలీస్ స్టేషన్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పరామర్శించిన హరీశ్ రావు

Harish Rao meets Srinivas in Masab Tank PS
  • విధులను అడ్డుకున్న కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్
  • మూడుసార్లు పిలిచినా విచారణకు రాకపోవడంతో నేడు అరెస్ట్
  • ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పరామర్శించారు. విధులను అడ్డుకున్న కేసులో ఈరోజు ఉదయం ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు.

పోలీసుల విధులను అడ్డుకున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను మూడుసార్లు విచారణకు పిలిచారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాస్‌ను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Srinivas
BRS
Congress
Hyderabad

More Telugu News