Vinod Kambli: భార‌త మాజీ క్రికెట‌ర్‌ వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై వైద్యుల‌ షాకింగ్ రిపోర్ట్!

Vinod Kambli has Clots in Brain Reveals Doctor after Medical Examinations
  • ఇటీవ‌ల మ‌రింత క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం
  • ప్ర‌స్తుతం థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స‌
  • అత‌ని మెదడులో ర‌క్తం గడ్డకట్టినట్లు వైద్యుల నిర్ధార‌ణ‌
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయనను శ‌నివారం నాడు థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కాంబ్లీకి వైద్య పరీక్షలు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు సోమ‌వారం షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆయన మెదడులో ర‌క్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. 

కాంబ్లీకి చికిత్స చేస్తున్న డాక్టర్ వివేక్ త్రివేది మాట్లాడుతూ.. భార‌త‌ మాజీ క్రికెట‌ర్‌ మొదట్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్‌, కండరాలు పట్టేయడం సమస్యలతో బాధపడుతూ శనివారం భివాండి పట్టణంలోని కల్హేర్ ప్రాంతంలోని ఆసుపత్రిలో చేరారాణి చెప్పారు. అయితే, ఆసుపత్రిలో ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్య బృందం వరుస పరీక్షల తర్వాత కాంబ్లీ మెదడులో ర‌క్తం గడ్డకట్టినట్లు గుర్తించింద‌ని త్రివేది తెలియజేశారు. 

కాంబ్లీ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వైద్య‌ బృందం మంగళవారం అదనపు వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని డాక్టర్ తెలిపారు. కాంబ్లీకి జీవితాంతం ఉచిత చికిత్స అందించాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ ఎస్ సింగ్ నిర్ణయించుకున్నట్లు త్రివేది తెలిపారు. 

1996 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన కాంబ్లీ తన రిటైర్మెంట్ తర్వాత కెరీర్‌లో ఆరోగ్యపరమైన ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయాడు. ఇటీవల ఆయన తన చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కనిపించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో కూడా ఆయన బలహీనంగానే క‌నిపించాడు. ఈ కార్యక్రమంలో తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌ను కలిసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు.

ఇక ఇటీవ‌ల ఆయన ఆరోగ్య‌ ప‌రిస్థితిని గ‌మ‌నించిన‌ భార‌త మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు వినోద్ కాంబ్లీకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
Vinod Kambli
Clots in Brain
Medical Examinations
Team India

More Telugu News