విద్యార్థులకు 'నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసిన కేంద్రం
- పాఠశాల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 5,8 తరగతుల విద్యార్ధులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్రం
- నో డిటెన్షన్ విధాన నిబంధనలను అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయమన్న కేంద్రం
అయితే, ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు మూడు వేల పాఠశాలల్లో మాత్రమే వర్తించనుంది. వీటిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. మరో కీలక విషయం ఏమిటంటే .. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధన అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం అని కేంద్రం పేర్కొంది.