మోదీ, అదానీ కలిసి దేశ పరువు తీశారు: రేవంత్ రెడ్డి
- అదానీ అవినీతిపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదన్న రేవంత్
- అదానీపై విచారణ జరిపించాలని డిమాండ్
- భారత వ్యాపార సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శ
దేశ పరువు మంటకలిపిన అదానీపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారత వ్యాపార సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని... చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించడంతో అమెరికా ప్రభుత్వం చర్యలకు పూనుకుందని చెప్పారు.
అదానీ అవినీతిపై చర్చించేందుకు, జేపీసీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని... అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లడం ఖాయమని రేవంత్ అన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ నేతలు లొంగిపోయారని... అందుకే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని విమర్శించారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామని అన్నారు.