Jagan: వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు... కేక్ కట్ చేసిన జగన్

Jagan participates Semi Christmas celebrations in YCP Office
  • మరికొన్ని రోజుల్లో క్రిస్మస్
  • మేనత్తతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
  • సందడిగా వైసీపీ ప్రధాన కార్యాలయం
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన క్రిస్మస్ పర్వదినం (డిసెంబరు 25) సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో, తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో నేడు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్, ఆయన మేనత్త వైఎస్ విమలమ్మ, ఇతర వైసీపీ నేతలు, క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ తన మేనత్తతో కలిసి కేక్ కట్ చేశారు. పలువురికి ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Jagan
Semi Christmas celebrations
YSRCP
Andhra Pradesh

More Telugu News