Telangana: తెలంగాణ సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం

Facial recognition attendance system from tomorrow
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయంలో ఈ నిబంధన అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

స‌చివాల‌యంలో ప‌ని చేసే అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, స‌చివాల‌యం హెడ్ నుంచి వేత‌నాలు పొందే ప్ర‌తి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. 
Go Back to Shorts
Telangana
CS Shanti Kumari
Congress

More Telugu News