upsc: సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

upsc mains result 2024 out
షార్ట్స్‌లో చూడండి
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) సోమవారం విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూ అర్హత సాధించిన అభ్యర్ధుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. 

ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిపికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించిన అధికారులు .. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. 

త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) సర్వీసులకు ఎంపిక చేస్తారు.  
Go Back to Shorts
upsc
upsc mains results

More Telugu News