హెడ్ చెప్పిందంతా అబద్ధం... సిరాజ్ వివరణ వీడియో
- వెల్ బౌల్డ్ అంటూ మెచ్చుకున్నానని హెడ్ వ్యాఖ్య
- హెడ్ తనను దూషించాడని సిరాజ్ ఆరోపణ
- ఆడిలైడ్ టెస్ట్ లో సిరాజ్- హెడ్ మధ్య గొడవ
హెడ్ మంచి బ్యాటర్ అని, అతడికి బౌలింగ్ చేయడాన్ని తాను ఆస్వాదిస్తానని సిరాజ్ చెప్పాడు. అయితే, మైదానంలో జరిగిన సంఘటనపై హెడ్ అబద్ధం చెబుతున్నాడని ఆరోపించాడు. హెడ్ సిక్సర్ బాదిన తర్వాతి బంతికే బౌల్డ్ చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని వివరించాడు. ఆ సంతోషంతో తానుంటే హెడ్ తనను తిడుతూ వెళ్లిపోవడం ఆగ్రహం తెప్పించిందని అన్నాడు. అయినప్పటికీ ఆ సమయంలో తానేమీ మాట్లాడలేదని, వీడియోలో చూస్తే తెలిస్తుందని అన్నాడు. క్రికెట్ జెంటిల్‌మన్ గేమ్ కానీ, హెడ్ ప్రవర్తించిన తీరు మాత్రం తప్పేనని సిరాజ్ స్పష్టం చేశాడు.