కోపంతో బంతిని లబుషేన్ వైపు విసిరికొట్టిన మహ్మద్ సిరాజ్.. వీడియో ఇదిగో
- బంతి సంధించే సమయంలో పక్కకు తప్పుకున్న మార్నస్ లబుషేన్
- చిర్రెత్తుకొచ్చి బంతిని విసిరికొట్టిన భారత పేసర్
- బ్యాట్ అడ్డు పెట్టిన మార్నస్ లబుషేన్
నిజానికి లబుషేన్ క్రీజు నుంచి పక్కకు తప్పుకోవడానికి అనివార్యమైన కారణం ఒకటి ఉంది. బంతిపై బ్యాట్స్మెన్ల దృష్టి మరల్చకుండా ఎదురుగా ఏర్పాటు చేసే నల్లటి తెర వద్ద ఓ వ్యక్తి కదలాడాడు. దీంతో లబుషేన్ ఏకాగ్రత దెబ్బతిని పక్కకు తప్పుకున్నాడు. టీవీ రీప్లేలో ఈ విషయం స్పష్టమైంది. అయితే అసలు విషయం తెలియక సిరాజ్ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఈ పరిణామం చేసుకుంది. ఆ ఓవర్ చివరి బంతి సమయంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట 70 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్లు 251 పరుగులు సాధించింది. ఇప్పటివరకు భారత్‌పై 71 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.