హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం .. పోలీసులకు పట్టుబడిన కొరియోగ్రాఫర్
- గచ్చిబౌలిలోని ఓ హోటల్ రూమ్‌లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు
- ఇద్దరు యువతులు సహా నలుగురి అరెస్టు
- అరెస్టయిన వారిలో కొరియోగ్రాఫర్ కన్న మహంతి
ఈ దాడిలో కొరియోగ్రాఫర్ కన్నా మహంతి, ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న ప్రియాంక రెడ్డి, గుల్లిపల్లి గంగాధర్, ఓగిరాల శాకీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పరీక్షలు నిర్వహించగా, ప్రియాంక రెడ్డి మినహా మిలిగిన ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ వినీత్ మీడియాకు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఫ్రీజి అనే వ్యక్తి నుంచి వీరు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫ్రీజి పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.