Allu Arjun: పుష్ప-2 రేంజి సెట్ చేయడానికి ఈ ఒక్క పోస్టర్ చాలు: అల్లు అర్జున్

Allu Arjun attends Pushpa Iconic Press Meet In Mumbai
  • డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు పుష్ప-2: ది రూల్
  • నేడు ముంబయిలో పుష్ప ఐకానిక్ ప్రెస్ మీట్
  • హాజరైన అల్లు అర్జున్, రష్మిక
  • అమ్మవారి గెటప్ గురించి వివరించిన అల్లు అర్జున్ 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ హైఓల్టేజ్ యాక్షన్ మూవీ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పుష్ప టీమ్ భారీ ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఇవాళ దేశ ఆర్థిక రాజధాని, హిందీ చిత్రసీమ బాలీవుడ్ కు కేంద్రస్థానం ముంబయి మహానగరంలోఐకానిక్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, మైత్రీ మూవీస్ అధినేతలు రవిశంకర్, నవీన్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా... వేదికపై కొన్ని ఫొటోలను ప్రదర్శిస్తుండగా... వాటిపై అల్లు అర్జున్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. పుష్ప-2లో తాను అమ్మవారి వేషంలో ఉన్న ఫొటోపై అల్లు అర్జున్ ఆసక్తికరంగా స్పందించారు. పుష్ప-2 చిత్రం ఎంత పెద్ద హిట్ కాబోతోందో, ఈ సినిమా రేంజి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క పోస్టర్ చాలని అన్నారు. ఇది పూర్తిగా దర్శకుడు సుకుమార్ ఐడియా అని వెల్లడించారు. 

తాను అమ్మవారి వేషం వేయడం వెనుక కథ ఉందని తెలిపారు. "నువ్వు ఈ సినిమాలో స్త్రీ వేషం వేయాలని సుకుమార్ చెప్పాడు. దాంతో నేను షాక్ గురయ్యాను. నేను లేడీ గెటప్ వేయడం ఏంటి... ఆర్యూ క్రేజీ! అంటూ సుకుమార్ కు రిప్లయ్ ఇచ్చాను. అయితే, దానికి ఓకే చెప్పాక... ఒకట్రెండు ఫొటో షూట్ లు జరిగాయి. 

మొదటి ఫొటో షూట్ ఫెయిలైంది, రెండో ఫొటో షూట్ ఫెయిలైంది... మూడో ఫొటో షూట్ తో అనుకున్న గెటప్ సాధించగలిగాం. సుకుమార్ ఏం రాబట్టాలనుకుంటున్నాడో అప్పుడు అర్థమైంది. సుకుమార్ నిజంగా జీనియస్ డైరెక్టర్. సినిమా కోసం మేమింత కష్టపడ్డాం, అంత కష్టపడ్డాం అని చెప్పుకోవడాన్ని నేను ఇష్టపడను. కానీ, నా సినీ కెరీర్ లో ఈ అమ్మవారి వేషం వేయడానికి చాలా శ్రమించాను. ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేను" అని వివరించారు. 
Allu Arjun
Pushpa-2
Iconic Press Meet
Mumbai
Tollywood
Bollywood

More Telugu News