ఢిల్లీలో భారీ పేలుడు కలకలం
- ప్రశాంత్ విహార్‌లోని పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలోని ఓ స్వీట్ షాప్‌లో ఘటన
- ఈరోజు ఉదయం 11:48 గంటల సమయంలో స్వీట్ షాప్ వద్ద పేలుడు
- ఘటనాస్థలిలో తెల్లటి పొడి లాంటి పదార్థం దొరికినట్లు పోలీసుల వెల్లడి
దాంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇక రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ప్రమాద స్థలిలో తెల్లటి పొడి లాంటి పదార్థం దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, పేలుడు ధాటికి భారీ శబ్ధం కారణంగా చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.